నిజ ఏసుక్రీస్తు మండలి
వికీపీడియా నుండి
|
భాగం వ్యాసముల క్రమం |
|---|
| యేసు |
| శుద్ధ జననం · క్రూసిఫిక్షన్ · రిసర్రెక్షన్ |
| మూలాలు |
| చర్చి · కొత్త కాన్వెంట్ అపోస్తలులు · సామ్రాజ్యం · గోస్పెల్ · కాలపట్టిక |
| బైబిల్ |
| పాత నిబంధన · కొత్త నిబంధన గ్రంధాలు · బైబిల్ చట్టాలు · అపోక్రైఫా |
| క్రైస్తవ ధర్మం |
| త్రిత్వం · (తండ్రి · కొడుకు · పరిశుద్ధాత్మ) చరిత్ర · ధర్మం · అపోలాజిటిక్స్ |
| చరిత్ర మరియు సాంప్రదాయాలు |
| ప్రథమ · సంఘాలు · వర్గలు · మిషనరీలు తూర్పు పశ్చిమ సంబంధాలు · క్రుసేడులు · ఉద్ధారణలు |
| డినామినేషన్ |
| క్రైస్తవ మత విషయాలు |
| బోధన · ప్రార్థన · ఎక్యూమెనిజం ఇతర మతాలతో సంబంధాలు · ఉద్యమాలు సంగీతం · లిటర్జీ · కేలండరు చిహ్నాలు · కళలు · విమర్శ |
| 30px క్రైస్తవ పోర్టల్ |
|
|
నిజ ఏసుక్రీస్తు మండలి ఒక స్వతంత్ర క్రిస్టియను చర్చి, దీనిని చైనాలోని బీజింగు నగరంలో 1917వ సంవత్సరమున స్థాపించినారు. దీనిని భారత దేశమునందు 1939నందు నెలకొల్పినారు. 20వ శతాబ్దం ప్రధమభాగంలో ప్రారంభమైన పెంతెకోస్తు-ప్రొటెస్టెంటు చర్చిలో ఇది ఒక భాగము. ప్రస్తుతం ఈ మండలికి 45 దేశాలలో 15 లక్షలు నుండి 25 లక్షలు దాకా సభ్యులున్నారు.
ఏసుక్రీస్తు ప్రవక్త పునరాగమనానికి తయారుగా భగవంతుని సందేశాన్ని అందరికీ తెలియబరచడం వీరి లక్ష్యము. మిగిలిన క్రైస్తవ పంథాలకూ, వీరికీ ప్రధాన భేదము ఏమంటే -దేవునిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఏకమై త్రిత్వము గాఉన్నారని తక్కిన చర్చిలు విశ్వసిస్తాయి. కాని ని జ క్రైస్తవ మండలి వారు మాత్రము ముగ్గురు లేరు ఏసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటారు.ఏసునామ ప్రజలు( Jesus only people) కూడా ఏసే దేవుడు అంటారు.
డిసెంబరు 25వతారీఖు పండుగ సూర్యదేవుని జన్మదినాన్ని జరుపుకొనే పండుగ అనీ, రోమను చక్రవర్తి కాన్‌స్టాంటైను కాలంలో క్రైస్తవమతంలోకి మిళితంచేయబడిందనీ విశ్వసిస్తారు గనుక నిజ ఏసుక్రీస్తు మండలికి చెందినవారు క్రిస్టమస్ పండుగ జరుపుకొనరు.
విషయ సూచిక |
[మార్చు] చర్చి యొక్క ఐదు ప్రాధమిక సిద్ధాంతాలు
[మార్చు] పరిశుద్ధాత్మ
"ప్రత్యేకమయన భాషలలో మాట్లాడడము అనేది పరిశుద్ధ ఆత్మను అందుకొనడానికి సూచన. ఇది పరలోక రాజ్యము లభిస్తుందనడానకి ఒక ఋజువు" (రోమా 8:16, ఎఫెసీయులు 1:13-14). ఇలా భాషలలో మాట్లాడే వారిని పెంతెకోస్తు సంఘం వాళ్ళు అని అనడం వాడుక.
[మార్చు] బాప్తిస్మము
"జల బాప్తిస్మము అనే కార్యక్రమము పాపములను ప్రక్షాళనచేయు పవిత్ర కార్యము. బాప్తిస్మము నది నీరు, సముద్రపు నీరు మరియు ఊట నీరు వంటి సహజమైన పరిశుద్ద జలముచే జరప వలెను. బాప్టిస్టు ముందుగా క్రీస్తు నామమున నీరు, పరిశుద్ధాత్మలను గ్రహింవలెను. ఆపై బాప్తిస్మము పొందు వ్యక్తిని పూర్తిగా నీటిలో ముంచాలి. వారి తలవంగియుండవలెను. ముఖము క్రిందివైపునకు ఉండవలెను".
[మార్చు] కాళ్ళు కడగటం
"పాదములు కడుగుట అనే పవిత్రకార్యక్రమము వల్ల బాప్తిసము తీసుకొన్నవానికి ప్రభువైన క్రీస్తుతో పాలుపంచుకొను అవకాశము కలుగును. ప్రేమ, పవిత్రత, వినయము, క్షమ, సేవ వంటి ఉత్తమగుణాలు అలవరచుకోవాలని ఈ పని మనకు ప్రబోధిస్తుంది. బాప్తిస్మము తీసికొన్న ప్రతివ్యక్తీ ఏసుక్రీస్తు నామమున ఇతరుల పాదాలు కడగాలి. ఒకరిపాదములు మరొకరు కడుగుకొనవలెను".
[మార్చు] రొట్టె, ద్రాక్ష రస ప్రసాదము
ఈ ప్రసాదం తీసుకోవటం అంటే క్రీస్తు మరణాన్ని స్మరించుకొంటూ పవిత్ర భావనతో ప్రభువు రక్తమాంసాలలో పాలుపంచుకోవటం. తద్వారా శాశ్వత జీవనము లభిస్తుంది. ఈ పవిత్ర కార్యమును ప్రతి సబ్బాతు రోజున నిర్వహించాలి. ఒకే రొట్టెను, ద్రాక్ష రసపాత్రను ఎంగిలి అనే భావన లేకుండా అందరూపాలుపంచుకోవాలి. ".
[మార్చు] సబ్బాతు దినము
సప్తమదినం.ఏడవ రోజు (శనివారము), దేవుడు విశ్రాంతి తీసుకున్న దినము.అది ప్రభువు కృపచే పాటింపదగినది. దేవుని సృష్టి కార్యమును స్మరించే పండుగ. తద్వారా ముందు జీవితమున శాశ్వత విశ్రాంతి, మోక్షము పొందే అవకాశము లభిస్తుంది".
[మార్చు] ఇతర నమ్మకాలు
[మార్చు] యేసుక్రీస్తు
"యేసుక్రీస్తు, శరీరధారి ఐన దేవుని వాక్యము. ఆయన పాపులను రక్షించుటకై తననుతాను అర్పించుకొనెను. మూడవరోజున పునరుజ్జీవుడై స్వర్గమునధిరోహించెను. ఆయనొకడే జనరక్షకుడు. భూమ్యాకాశములను సృజించినవాడు. నిజమైన దేవుడు".
[మార్చు] బైబిల్
"పరిశుద్ధ బైబిల్, కొత్త మరియు పాత నిబంధన గ్రంధములతో కూడి, ప్రభువు ప్రేరేపణతో వెలువడిన సత్య గ్రంధము. క్రైస్తవ జీవనానికి మార్గదర్శకము".
[మార్చు] మోక్షము
" విశ్వాసము వలన భగవంతుని కృప, అందువలన మోక్షము లభిస్తాయి. విశ్వసించేవారు పరిశుద్ధాత్మపై ఆధారపడి పవిత్రతను పొంది, భగవంతుని సేవించి, మానవజాతిని ప్రేమించాలి ".
[మార్చు] సంఘం
చర్చి (సంఘం ) అనేది ప్రభువైన యేసుక్రీస్తుచే పవిత్రాత్మ ద్వారా జలప్రళయకాలంలో ఏర్పరచబడినది. ఇది విశ్వాసులచే పునరారంభింపబడిన నిజమైన చర్చి".
[మార్చు] రెండవరాకడ
ఏసుక్రీస్తు తిరిగి వస్తాడు.చివరి రోజున ప్రభువు స్వర్గము నుండి ప్రపంచముపై తీర్పు చెప్పుటకు అవతరించును. పరిశుద్ధులైన వారు శాశ్వత జీవనము పొందగలరు. కౄరులైనవారు శాశ్వతముగా శపింపబడుదురు".

